
సుంకరపాలెం ఘటనపై కేసు నమోదు
ఎకై ్సజ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
తాళ్లరేవు: మద్యం తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకులను వెంబడించిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ బి.ఆనందరాజుపై ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి సస్పెన్షన్ వేటు వేశారు. సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద శనివారం జరిగిన ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కోట శ్రీరామ్ అనే విద్యార్థి మృతిచెందడంతో బాధ్యులపై చర్యలు చేపట్టాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సుంకరపాలెం, పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది సుంకరపాలెం చెక్‌పోస్టును ముట్టడించి, ఆందోళన చేశారు. అర్థరాత్రి రెండు గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. యువకులను ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఆనందరాజు వెంబడించినట్లు నిర్థారణ కావడంతో, అతడిపై చర్య తీసుకుంటున్నట్టు డీసీ చైతన్యమురళి తెలిపారు. ఆయన వివరాల మేరకు, ఐడియల్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు రెండు బైకులపై యానాం వచ్చి, తిరిగి వెళుతుండగా ఎకై ్సజ్ సిబ్బంది చెక్ పోస్టు వద్ద తనిఖీ కోసం ఆపారు. ముందుగా బైక్‌పై వెళుతున్న యువకులు ఒత్తిడికి గురై, బైక్‌పై వేగంగా వెళుతూ లారీని దాటే క్రమంలో వెనుకనున్న విద్యార్థి కిందకు దూకగా, శ్రీరామ్ అదుపుతప్పి లారీ కిందపడి మృతిచెందాడు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కానిస్టేబుల్ ఆనందరాజును సస్పెన్షన్‌కు ఆదేశించామని, ఇన్ఫార్మర్‌పై చర్యలకు నిర్దేశించినట్టు డీసీ తెలిపారు. కాగా, మృతదేహానికి ఆదివారం శవ పంచనామా నిర్వహించినట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment