
ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాల ఎంపిక
అమలాపురం రూరల్: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) పార్కుల ఏర్పాటుకు ముమ్మిడివరం, రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలలో స్థలాలు ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ 26 జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ ద్వారా వర్షాకాలంలో భవన నిర్మాణ రంగం నిరంతరాయంగా పనులు కొనసాగించేలా స్టాక్ యార్డులలో సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు చేయాలని ఆదేశించారు. మాన్యువల్ సెమీ మేకనైజ్డ్ రీచులలో ఇసుక తవ్వకాలను మే, జూన్ మాసాలలో ముమ్మరం చేసి స్టాక్ యార్డులకు ఇసుకను తరలించి నిల్వ చేయాలని ఆదేశించారు. పంట కాలువలు మూసివేసే లోగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపుకోవాలన్నారు. మూడో శనివారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ– వేస్ట్) రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. డీపీఓ శాంతిలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు వీఐపీ నాయుడు కేవీవీ ఆర్ రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ డివిజనల్ ఇంజినీర్ పద్మనాభం, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ బి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకే పీ ప్రసాద్, డీఐపీ ఆర్‌ఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఒకటి నుంచి ఇసుక తవ్వకాలు
జిల్లాలోని ఐదు సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచులలో మే ఒకటో తేదీ నుంచి ఇసుక తవ్వకాల నిర్వహించాలని కలెక్టర్ ఇసుక కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం జిల్లా ఇసుక కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించారు.