వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌పై తప్పుడు కేసు
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ఒమ్మంగి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ (నాని)పై ప్రత్తిపాడు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగితే కొంకిపూడి శివ లోవరాజును గ్రామ పెద్దగా రామకృష్ణ మందలించారు. దీనిని ఆసరాగా తీసుకొన్న కూటమి నేతలు ఆ సమయంలో అక్కడ లేని లోవరాజు భార్య సత్యతో అసభ్యకరంగా ప్రవర్తించానంటూ తనపై తప్పుడు కేసు పెట్టించి వేధిస్తున్నారని నాని వాపోయారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థిపై దాడి కేసులో
నిందితుల అరెస్ట్
మలికిపురం: ఏఎఫ్‌డీటీ జూనియర్ కళాశాల విద్యార్థి ఆర్.జయసాయి యువరాజుపై దాడి చేసిన కేసులో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు గురువారం ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. పెదతిప్ప, మలికిపురం గ్రామాలకు చెందిన ఇరువురు మైనర్లు కావడంతో వారిని రాజమహేంద్రవరం బాలనేరస్తుల కోర్టులో హాజరుపర్చి బాల నేరస్తుల వసతి గృహానికి తరలించామన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ఈనెల 5న ఒక యువతి విషయంలో బాధిత విద్యార్థి యువరాజుపై నలుగురు యువకులు తీవ్రంగా దాడి చేసిన ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై తెలిపారు.
సత్యదేవుని సన్నిధిలో
వృద్ధాశ్రమ సభ్యులు
అన్నవరం: విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రావివలస గ్రామానికి చెందిన రాహుసౌరభ్ నిత్యాన్నదాన వృద్ధాశ్రమానికి చెందిన వృద్ధుల కోరిక దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ చొరవతో నెరవేరింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ రాహుసౌరభ్ నిత్యాన్నదాన వృద్ధాశ్రమానికి చెందిన 22 మంది వృద్ధులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించి పూజలు చేశారు.
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌పై తప్పుడు కేసు
Comments
Please login to add a commentAdd a comment