కాకినాడ క్రైం: ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యుటివ్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి ఎన్నిక శనివారం కాకినాడలోని ఎకై ్సజ్ కార్యాలయంలో జరిగింది. ఈ ఎన్నికలో ఎగ్జిక్యుటివ్ కమిటీకి ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పి.శివప్రసాద్, సహాయ అధ్యక్షురాలిగా పి.సూర్యకుమారి, ఉపాధ్యక్షుడిగా పి.శ్రీనివాస్, కార్యదర్శిగా ఎ.సతీష్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.వెంకట లక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా కేవీఎస్‌ఆర్ రవితేజ, కోశాధికారిగా పి.వంశీరామ్, ఎగ్జిక్యుటివ్ కమిటీ సభ్యులుగా కె.రామ్‌మోహన్‌రావు, టి.నిరంజన్‌రావు, ఆర్.క్రాంతి కిరణ్, ఏ.రామాంజనేయ, జె.విజయకుమార్, కె.అన్నవరం ఎంపికయ్యారు.
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలో విద్యుత్ బిల్లుల వసూళ్ళ కౌంటర్లు ఆదివారం కూడా పని చేస్తాయని ఏపీ ఈపీ డీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ శనివారం ప్రకటించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేసారు.
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా హాకీ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు, ఒలింపిక్ సంఘ సీఈఓ, ప్రధాన కార్యదర్శి చుండ్రు గోవిందరాజు, ట్రస్ట్ హాస్పటల్ అధినేత డాక్టర్ రామకృష్ణలు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. మహిళల విభాగంలో బీహార్ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒడిస్సా సెక్టార్ 7–0 స్కోర్‌తో, ఢిల్లీ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యాణా సెక్టార్ 4–0 స్కోర్‌తో, తెలంగాణ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ సెక్టార్ 20–0 స్కోర్‌తో గెలిచాయి. పురుషుల విభాగంలో కర్ణాటక సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిశా 10–2 స్కోర్‌తో, ఆర్బీఎస్ సిమ్లా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్బీఎస్ కాన్‌పూర్ 2–0 స్కోర్‌తో గెలవగా, ఆర్బీఎస్ ముంబాయి, ఆర్బీఎస్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోర్‌తో డ్రాగా ముగిసింది. ఉత్తరాఖండ్ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ సెక్టార్ 5–0 స్కోర్‌తోను, మధ్యప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ సెక్టార్ 5–0 స్కోర్‌తో విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment