నాన్న స్ఫూర్తితో సమాజ సేవ
వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయినా ప్రవృత్తిరీత్యా ఇంద్రజాలికునిగా సమాజాన్ని చైతన్య పరచడంతో పాటు పేదల సేవలో నాన్న శ్యామ్ జాదూగర్ ముందుకు వెళ్తున్నారు. ఆయన బాటలోనే నేనూ వెళ్తున్నా. మన వ్యక్తిగత జీవితం, ప్రయోజనాలను కాపాడుకుంటూ కొంత సమయాన్ని, కొంత మొత్తాన్ని మానవసేవకు వినియోగించాలన్నది ఆయన తత్వం. ఆ మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు.
–డాక్టర్ చింతా మోహిత్,
యువ ఇంద్రజాలికుడు,
ఫిజియోఽథెరపిస్ట్, ర్యాలి
జీవితానికి పరమార్థం ఉండాలి
ఒక మంచి ఫ్యామిలీలోకి అడుగుపెట్టబోతున్నాను. మన జీవితాలు మన కోసమే కాదు.. సమాజానికి కూడా ఉపయోగపడాలి.. అనే మంచి మనస్తత్వంతో మ్యాజిక్ ఫ్యామిలీ ముందుకు వెళుతుంది. మా నిశ్చితార్థం అనంతరం కొన్ని రోజుల్లోనే వారి సేవా దృక్పథాన్ని అవగాహన చేసుకున్నాను. ఆ సేవలను ఒంటపట్టించుకున్నాను. దానికనుగుణంగా మన జీవితాలకు ఒక అర్థం.. పరమార్థం ఉండాలన్నదే లక్ష్యంగా అందరం కలిసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
–డాక్టర్ ఉప్పుగంటి సాయిసీత,
బండారులంక, అమలాపురం రూరల్ మండలం
నాన్న స్ఫూర్తితో సమాజ సేవ
Comments
Please login to add a commentAdd a comment