సైబర్ నేరాలపై అప్రమత్తం
కై కలూరు: సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలు అతిగా భయపడటం, ఆశపడటం రెండూ వీడాలని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. కలిదిండి పోలీసుస్టేషన్‌కు వార్షిక తనిఖీలో భాగంగా శనివారం ఆయన విచ్చేశారు. విలేకరులతో మాట్లాడుతూ వీడియో, ఫోన్స్ కాల్స్‌లో కొందరు ప్రజలను భయ పెట్టి డబ్బులు గుంజుతున్నారని, ఇటీవల కేవలం రూ.1,000కి బంగారం ఇస్తామని మోసం చేయడాన్ని ఛేదించామన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో 10 మందికి మెసేజ్ షేర్ చేస్తే మీకు లాభం ఉంటుందని ఎవరైన ప్రలోభపెడితే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. ఎవరికీ ఓటీపీలు చెప్పవద్దన్నారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, కై కలూరు రూరల్, టౌన్ సీఐలు వి.రవికుమార్, పి.కృష్ణ, ఎస్సైలు వి.వెంకటేశ్వరరావు, సీహెచ్.రామచంద్రరావు, వీరభ్రదరావు పాల్గొన్నారు.
తాడినాడ ప్రజలకు అవగాహన : ఎస్పీ శివకిషోర్ తాడినాడ గ్రామ ప్రజలతో మమేకమ య్యారు. చిట్టీలు, ఆన్‌లైన్ మోసాలు, ఈవ్‌టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మండలంలో ఏర్పాటుచేసిన 21 సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన మానిటరింగ్ గదిని, ఆవరణలో షటిల్ కోర్టు, కోరుకొల్లులో ఎస్సీ బాలికల హాస్టల్‌లో వాటర్ ట్యాంకు, సీసీ కెమెరాలను ప్రారంభించారు. కలిదిండి శివారు భోగేశ్వరలంకలో శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment