భీమవరం అర్బన్: ఓ మహిళ ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూట్లపాడు గ్రామానికి చెందిన ఆకుల శ్రీరామ్మూర్తికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందిపువారిపాలెంకు చెందిన ఆకుల దేవి సాయి రామ నాగలక్ష్మి (29)కి 2018లో వివాహమైంది. అప్పట్లో పసుపు కుంకుమల కింద 50 సెంట్లు భూమి, రూ. 3 లక్షలు, ఆడపొడుచలు లాంఛనంగా రూ.లక్షా 50 వేలు, 5 కాసులు బంగారం ముట్టజెప్పారు. కొంతకాలం దాంపత్య జీవితం సాఫీగా సాగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. గత కొంతకాలంగా రామ నాగలక్ష్మిని భర్త శ్రీరామ్మూర్తి, అత్త వరలక్ష్మి, మామ ఆదినారాయణమూర్తి, ఆడపొడుచులు ముత్యాల పష్పవతి, మేడ్చర్ల లక్ష్మి, సీహెచ్ సత్యవాణి వేధిస్తున్నారు. భీమవరంలో నివసిస్తున్న శ్రీరామ్మూర్తి తన కుటుంబంతో కలిసి ఈ నెల 15న సొంతూరు గూట్లపాడు గ్రామానికి వచ్చాడు. 16వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే సోమవారం ఏమైందో తెలియదు కాని రామ నాగలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన అక్క మృతి చెందిందని దేవి సాయి రామ నాగలక్ష్మి సోదరుడు నందిపు వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త, అత్తమామల వేధింపులే కారణమని సోదరుడి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment