కేంద్ర బడ్జెట్‌లో రైతులకు అన్యాయం
ఏలూరు (టూటౌన్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా, కార్మికులు, రైతులపై భారాలు వేసి కార్పొరే ట్ కంపెనీలకు దోచి పెట్టే బడ్జెట్‌గా ఉందంటూ వా మపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ బడ్జెట్‌లో వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల ప్రస్తావన లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరల జాడే లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధుల కోత పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం, పునరావాసం ప్రస్తావనే లేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment