ఆటో స్టాండ్ తొలగింపుపై మండిపాటు
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న ఆటో స్టాండ్‌ను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడాన్ని ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ సంఘ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి జె.గోపి ఖండించారు. గురువారం ఇక్కడ నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.రాజు, బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న 300 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమర్‌కుమార్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ తీరు దారుణంగా ఉందన్నారు. ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వా లు పరిశ్రమలు మూతపడుతున్నా మాట్లాడటం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు య థావిధిగా ఆటో పార్కింగ్ స్టాండ్‌ను కొనసాగించాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హె చ్చరించారు. అనంతరం కో–ఆప్షన్ సభ్యు డు ఎస్‌ఎంఆర్ పెదబాబుకి వినతి పత్రం అందజేశారు.
ట్రిపుల్‌ఐటీలో వాట్సాప్ గవర్నెన్స్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని, ఆ నంబర్ ద్వారా విద్యార్థులు సమస్యలను తెలియజేయవచ్చని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు గురువారం పరుపులు పంపిణీ చేసి డైనింగ్ హాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ఏఓ లక్ష్మణరావు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. డీన్ అకాడమిక్స్ చిరంజీవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం మెస్ హాళ్లను సందర్శించి ఆహార పదార్థాల వంటల ప్రక్రియను పర్యవేక్షించారు.
గురుకులంలో ఆకస్మిక తనిఖీ
ముసునూరు: గురుకుల విద్యార్థినులకు మంచి ఆశయాలు, లక్ష్యాలు, నడవడిక అలవర్చి వా టిని నెరవేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చే యాలని ఏపీ గురుకుల విద్యాలయ సొసైటీ జాయింట్ సెక్రటరీ అబేదుల్లా ఆదేశించారు. ఇటీవల గురుకుల పాఠశాలలో ఏర్పడిన సమస్యలపై పాఠశాల కమిటీ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ముసునూరులోని బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినులు, ఎస్‌ఎంసీ సభ్యులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment