ఏలూరు(మెట్రో): ఏలూరులో ఈనెల 23న జరిగే గ్రూప్–2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ పి.ధాత్రిరెడ్డితో కలిసి అధికారులతో ఆమె సమీక్షించారు. ఆది వారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఉదయం 9:30 గంటలలోపు, మధ్యాహ్నం 2.30 గంటలలోపు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 4,415 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 21 నుంచి ఏలూరు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని, పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. విద్యుత్ అంతరాయం కాకుండా చూడాలన్నారు.
ప్రశ్నపత్రాలకు భద్రత
గ్రూప్–2 పరీక్షల ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీ ట్లకు పటిష్ట భద్రత కల్పించాలని జేసీ ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరీక్షల ఓఎంఆర్ షీట్ల భద్రతను ఆమె పరిశీలించారు. ఓఎంఆర్ షీట్లు జిల్లాకు చేరుకున్నాయని జేసీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment