కమిషనర్ మాటతీరుపై ఆందోళన
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ వీడియో కాన్ఫరెన్స్‌లో వాడుతున్న భాష తమ మనోభావాలు దెబ్బతీసేలా, అగౌరవ పరిచేలా ఉందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గురువారం కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వీసీలో ఉద్యోగుల విషయంలో ఆయన ప్రవర్తించిన తీరుతో మానసిక క్షోభకు గురైనట్టు చెబుతున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా పరుష పదజాలంతో మాట్లాడటం తగదని అంటున్నారు. అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన కమిషనర్ దారుణంగా మాట్లాడటం తగదని వాపోతున్నారు. తమను రోజూ కమిషనర్ మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కలెక్టర్ వెట్రిసెల్వి చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. కమిషనర్ తీరుపై ముఖ్యమంత్రి తదితరులకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు ఓ ఉద్యోగి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment