రాష్ట్రస్థాయి నెట్‌బాల్ విజేత ‘పశ్చిమ’
పాలకోడేరు: రాష్ట్రస్థాయి అండర్ 19 బాలబాలికల నెట్‌బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు విజేతగా నిలవగా జిల్లా బాలుర జట్టు తృతీయస్థానం సాధించిందని జిల్లా నెట్ బాల్ సంఘ కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 16 17 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డాన్ బాస్కో హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో 10వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్ 19 బాల బాలికల నెట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. విజేతలకు తూర్పుగోదావరి జిల్లా నెట్ బాల్ సంఘ అధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి, డాన్ బాస్కో హైస్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఐ.బల్కదర్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ నెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ పి.దావూద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను పలువురు అభినందించారు.
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ విజేత ‘పశ్చిమ’
Comments
Please login to add a commentAdd a comment