23 నుంచి శివయ్య కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివయ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 1 వరకు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి సోమవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 23న ఉదయం 10 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 26న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు లింగోధ్భవకాల అభిషేకం అనంతరం స్వామివారి కల్యాణోత్సవం, ఆ తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. వచ్చేనెల 1న ఆలయంలో జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
26న రాత్రి స్వామివారి కల్యాణం
23 నుంచి శివయ్య కల్యాణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment