బాదంపూడిలో 30 వేల కోళ్ల ఖననం
ఉంగుటూరు: బాదంపూడిలోని వెంకట మణికంఠ ఫారంలో బర్డ్‌ఫ్లూ సోకిన 30 వేల కోళ్లను శనివారం ఖననం చేశారు. ఈ ప్రక్రియను పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర డైరెక్టర్ దామోదరనాయుడు పరిశీలించారు. జిల్లాకు చెందిన పశువైద్యులు, సహాయకులు సుమారు 100 మంది జేడీ టి.గోవిందరాజు పర్యవేక్షణలో కోళ్ల ఖననం చేశారు. ఈ ఫారం సమీపంలోని మరో ఫారంలోనూ కోళ్ల ఖననం ప్రక్రియ కొనసాగింది. మండలంలో చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా పెట్టారు. గ్రామంలో మెడికల్ క్యాంపులు కొనసాగు తున్నాయి. తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ మనోజ్ పర్యవేక్షిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉండే హైస్కూల్ ప్రాంతంలో పటిష్ట పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment