శూద్రులే దేశ నిర్మాతలు
ఏలూరు (టూటౌన్): ఉత్పత్తి రంగంలో ఉన్న శూద్రులే దేశ నిర్మాతలని బహుజన రాజ్యాధికార సిద్ధాంత కర్త కంచ ఐలయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జేఏసీ 5వ వార్షికోత్సవాన్ని శుక్రవారం స్థానిక అంబికా కన్వెషన్ హాల్‌లో నిర్వహించారు. సాహితీవేత్త లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐలయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంగ్లిష్ మీడియం విద్యను అభ్యసించి అమె రికా, యూరప్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన తర్వాత వారిని అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందన్నారు. బహుజనులు జాతీయ పారిశ్రామిక వేత్తలుగా మారినప్పుడే దేశంలో రాజ్యాధికారం వస్తుందని అన్నారు. ప్రతి ఇంట్లో మహిళలను సమానత్వంతో గౌరవించే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కలు తేలాలని, బీసీ జనాభాను బట్టి రాజకీయ రిజర్వేషన్‌లు ఇవ్వాలన్నారు. సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ప్రకటించాలని ప్రభు త్వాన్ని కోరారు. షేక్ ముస్తాఫా అలీ, చింతపల్లి గురుప్రసాద్, డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్, పళ్లెం ప్రసాద్, మరగాని శ్రీనివాస్, కె.లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment