అదుపుతప్పి వాహనాల్ని ఢీకొన్న కారు
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో కారు రోడ్డుపై ఉన్న మోటారు సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైక్‌లు, రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కారు నడుపుతున్న డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో కారు అదుపుతప్పి బైక్‌లు, కార్లను ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి శ్రీనివాసా థియేటర్ రోడ్డులో శుక్రవారం కారు నడుపుతున్న డ్రైవర్కు ఫిట్స్ రావటంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ఆ సమయంలో నెమ్మదిగానే వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనాలను ఢీకొన్న కారు ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు వెనుక సీటులో ఉన్న కుటుంబ సభ్యులు డ్రైవర్ పరిస్థితిని గమనించి ఆరోగ్యం కుదుట పడే వరకు ప్రాథమిక చికిత్స అందించారు. దెబ్బతిన్న వాహనాలకు నష్ట పరిహారం ఇచ్చేందుకు కారు యజమాని అంగీకరించడంతో కేసు నమోదు కాలేదని స్థానికులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment