వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా పరసా
చాట్రాయి: మండలంలోని చిన్నంపేట గ్రామానికి చెందిని పరసా చెన్నారావును రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా పార్టీ ఎంపిక చేసింది. ఆయన ఎంపిక పట్ల కో ఆపరేటివ్ యూనియన్ రాష్ట్ర మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు పుచ్చకాయల సుబ్బారెడ్డి, ఎంపీపీ లంకా నిర్మల తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా తాళ్లూరి ప్రసాద్
బుట్టాయగూడెం : వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ముప్పినవారిగూడెంకు చెందిన తాళ్లూరి ప్రసాద్ నియమితులైనట్లు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. ప్రసాద్ వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. పోలవరం నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు.
జిల్లా కమిటీలో నలుగురికి చోటు
జంగారెడ్డిగూడెం : వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీలో జంగారెడ్డిగూడెం, మండలానికి చెందిన నలుగురికి ప్రాధాన్యత లభించింది. జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ముప్పిడి శ్రీను, జిల్లా కార్యదర్శులుగా అయినాల వెంకటరమణమూర్తి, వామిశెట్టి హరిబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా రాఘవరాజు ఆదివిష్ణును నియమించారు.
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా పరసా
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా పరసా
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా పరసా
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా పరసా
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శిగా పరసా
Comments
Please login to add a commentAdd a comment