ఆటోకు నిప్పుపెట్టిన వ్యక్తిపై కేసు
భీమడోలు: వ్యక్తిగత విభేదాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తికి చెందిన ట్రక్కు ఆటోను గురువారం రాత్రి పెట్రోలు పోసి దగ్ధం చేశాడు. భీమడోలు సంతమార్కెట్ ఏరియాకు చెందిన నిమ్మగడ్డ మణికుమార్ కొడుకుకు, లింగంపాడు గ్రామానికి చెందిన కోన అశోక్‌కుమార్‌కు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మణికుమార్ తన ట్రక్కు ఆటోను సంతమార్కెట్ వద్ద ఉంచాడు. అశోక్‌కుమార్ కోపంతో ఆటోను తగులబెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అశోక్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment