గ్రూప్–2కు పటిష్ట ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఈనెల 23న ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే గ్రూప్–2 ప రీక్షల నిర్వహణలో ఎ టువంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్, గ్రూపు–2 పరీక్షల జిల్లా కో–ఆర్డినేషన్ అధికారి పి.ధాత్రిరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రూప్–2 పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ సభ్యులు, లైజన్ అధికారులు, పరీక్షల కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఆదివారం నిర్వహించే గ్రూపు–2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సమాచారం నిమిత్తం సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంపులు ప్రతి కేంద్రం వద్ద ఏర్పాటుచేయాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ 163 అమలుచేసి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. గ్రూపు–2 పరీక్షల సమాచారం నిమిత్తం కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 99122 44293, 80085 39786 నంబర్లలో సంప్రదించాలని జేసీ ధాత్రిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment