ముదినేపల్లి రూరల్: వివాహానికి హాజరైన బంధువుల నగల చోరీపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని వడాలిలో కె.ప్రసాద్ ఇంటి వద్ద జరిగిన వివాహానికి రాజమండ్రి నుంచి వచ్చిన నంబూరి బుజ్జి దంపతులు ఈ నెల 16న హాజరయ్యారు. వీరి వెంట సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకువచ్చి వాటిని బ్యాగులో ఉంచి పెళ్లి వారి బంధువుల ఇంటి వద్ద నిద్రపోయారు. తెల్లవారేసరికి బంగారు ఆభరణాలు కన్పించలేదు. బంధువులను విచారించినప్పటికి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కై కలూరు రూరల్ సీఐ రవికుమార్ ఎస్సై వీరభద్రరావుతో కలిసి పెళ్లి కుమారుడి ఇంటి వద్ద గురువారం బంధువులను విచారించి వివరాలు సేకరించారు.
హోంగార్డు ద్విచక్ర వాహనం మాయం
కై కలూరు: రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ఉంచి హోంగార్డు బైక్ చోరీకి గురికాగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. కలిదిండి మండలం పటమటిపాలెంకు చెందిన పరసా వెంకటేశ్వరరావు హోంగార్డుగా పనిచేస్తున్నాడు. రోజూ ద్విచక్రవాహనం కై కలూరు రైల్వేస్టేషన్‌లో పెట్టి వెళ్తాడు. గురువారం రాత్రి బండి పెట్టి శుక్రవారం ఉదయం వచ్చేటప్పుటికి వాహనం లేదు. టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టి బండిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment