ఫుట్‌బాల్‌లో భారత్ విజయంపై హర్షం
దెందులూరు: దుబాయిలో జరుగుతున్న పింక్ లేడీస్ కప్ పోటీల్లో జోర్డాన్‌పై భారత్ 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీల్లో రష్యా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్, జోర్డాన్ దేశాల బాలికల జట్లు పాల్గొన్నాయని ఆయన తెలిపారు. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం వెనుక నైపుణ్యత కలిగిన శిక్షణ, జట్టులోని బాలికల నిరంతర సాధన, పట్టుదల, క్రమశిక్షణ ఉన్నాయని పేర్కొన్నారు. జట్టు హెడ్ కోచ్‌తో పాటు భారత జట్టు బాలికలకు ఆయన అభినందనలు తెలిపారు.
హ్యాండ్‌బాల్ బాలికల జట్టు ఎంపిక
దెందులూరు: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాలికల జట్టును(జేఎన్‌టీయూ, కాకినాడ) సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని వేగవరం హేలాపురి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ లావణ్య, ఏవో కరుణానిధి తెలిపారు. శనివారం కళాశాలలో జట్టు వివరాలను ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రం సేలం యూనివర్సిటీలో మార్చి 3 నుంచి 7 వరకు జరిగే వాలీబాల్ పోటీల్లో ఆడతారన్నారు.
జట్టు వివరాలు
కే సంధ్య, జీ ప్రవళిక సత్య, జీ లావణ్య అనుసాయి, కే దుర్గ, బీ వెంకట కావ్య, సీహెచ్ రాణి ప్రవళిక, వీ శాంభవి, ఆర్.వెంకట స్వప్న, పీ కల్పన, ఆర్.సౌజన్య, కే సుజాత, పీ లక్ష్మి ప్రసన్న, బీరమ్య, పీ రమ్యశ్రీ, బీ సుచిత్రను ఎంపిక చేశామన్నారు.
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఎటుచూసినా భక్తులతో కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. ఉచిత అన్నప్రసాదం కోసం వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులు బారులు తీరారు. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గలేదు.
Comments
Please login to add a commentAdd a comment