ఆగిరిపల్లిలో చికెన్ మేళా
ఆగిరిపల్లి: వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు స్థానిక బస్టాండ్ వద్ద నిర్వాహకులు చికెన్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉడికించిన, చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదని నిర్వాహకులు వివరించారు.
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
నూజివీడు: కాలేజీకి వెళ్లలేదని తల్లి మందలించడంతో పట్టణంలోని బాపూనగర్‌కు చెందిన బట్ర వెంకట రమ్య(18) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో వెంకట రమ్య పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లలేదని తల్లి రమ్యను మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు చూసి పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు తెలిపారు.
ఆగిరిపల్లిలో చికెన్ మేళా
Comments
Please login to add a commentAdd a comment