దాడులు.. బెదిరింపులు
ఆక్వా ఆక్రమణలో బోదెలు
ఉండి నియోజకవర్గంలో పంట బోదెలు, మురుగు బోదెలను ఆక్వా చెరువులు మింగేస్తున్నాయి. అక్రమార్కులు వాటిని చెరువుల్లో కలిపేసుకుంటున్నారు. IIలో u
శురకవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ నేతలు బరితెగించారు.. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించారు. ఓటు వేసే సమయంలోనూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా వ్యవహరించడంతో పాటు పీడీఎఫ్ ఏజెంట్లపై దాడులు, దౌర్జన్యాలు, కొన్ని చోట్ల పోలింగ్ బూత్ నుంచి గెంటివేసి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం ఉన్న పోలింగ్ చివరి రెండు గంటల్లో సుమారు 25 శాతం పెరిగింది. ఉమ్మడి పశ్చిమలో పూర్తిగా ఏకపక్షంలో ఎన్నికలు నిర్వహించారని పీడీఎఫ్ ఆరోపణలు గుప్పించినా అధికారులు చాలా తేలికగా తీసుకున్నారు. మరోవైపు చివరి గంట సమయంలో దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. మొత్తంగా ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలై 69.50 శాతంగా పోలింగ్ నమోదైంది. ఏలూరు జిల్లాలో 70.13 శాతం, పశ్చిమలో 69.80 శాతం నమోదైంది.
పోలింగ్ బూత్‌ల వద్ద స్వైరవిహారం
పచ్చమూకలు రెచ్చిపోయాయి. సాధారణ ఎన్నికల తరహాలో వ్యవహరించి ప్రధాన పోటీదారుగా ఉన్న పీడీఎఫ్ ఏజెంట్లు, నాయకులపై అడుగడుగునా జులుం ప్రదర్శించారు. ఎర్ర చొక్కా వేసుకు వచ్చారని పీడీఎఫ్ నాయకులను కొన్నిచోట్ల పోలీసులు అరెస్టు చేసి, పసుపు చొక్కా వేసుకువచ్చిన టీడీపీ నేతలు పోలీసుల ఎదురే పోలింగ్ బూత్‌ల వద్ద స్వైరవిహారం చేసినా పట్టించుకోని పరిస్థితి. ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఏలూరు జిల్లాలో కై కలూరు, నూజివీడు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో 66 పోలింగ్‌బూత్‌ల్లో 42,242 మందికిగాను 29,651 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 70,052 మంది ఓటర్లకుగాను 48,893 మంది ఓటుహక్కు వినియోగించుకోవడంతో 69.80 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. చివరి రెండు గంటలు మాత్రం అధికార పార్టీ హడావుడితో పోలింగ్ శాతం సుమారు 25 శాతం మేర పెరిగింది. కేవలం అధికార పార్టీ దౌర్జన్యకాండతోనే పోలింగ్ శాతం పెరిగింది.
న్యూస్‌రీల్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్‌లో అక్రమాలు
ఉమ్మడి పశ్చిమలో టీడీపీ నేతల బరితెగింపు
పోలింగ్ కేంద్రాల వద్ద తారాస్థాయిలో హల్‌చల్
పెదవేగిలో పీడీఎఫ్ ఏజెంట్‌పై దౌర్జన్యం
లింగపాలెం మండలంలో పోలింగ్ కేంద్రం నుంచి పీడీఎఫ్ ఏజెంట్ గెంటివేత
ఏలూరు కోటదిబ్బలో డబ్బుల పంపిణీని అడ్డుకున్న పీడీఎఫ్
భారీగా దొంగ ఓట్ల నమోదు
పూర్తిగా వదిలేసిన పోలీస్ యంత్రాంగం
ఏలూరు జిల్లాలో 70.13 శాతం, పశ్చిమలో 69.80 శాతం పోలింగ్ నమోదు
ఏలూరు జిల్లాలో పోలింగ్ సరళి
ఉదయం 10 గంటలకు 3,403 ఓట్లు పోలై 8.05 శాతం.
మధ్యాహ్నం 12 గంటలకు 10,836 ఓట్లు పోలై 25.63 శాతం.
మధ్యాహ్నం 2 గంటలకు 19,898 ఓట్లు పోలై 47.06 శాతం.
సాయంత్రం 4 గంటలకు 29,651 ఓట్లు పోలై 70.13 శాతం నమోదైంది.
పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగ్ సరళి
ఉదయం 10 గంటలకు 6,978 ఓట్లు పోలై 9.96 శాతం.
మధ్యాహ్నం 12 గంటలకు 19,133 ఓట్లు పోలై 27.31 శాతం.
మధ్యాహ్నం 2 గంటలకు 31,562 ఓట్లు పోలై 45.06 శాతం.
సాయంత్రం 4 గంటలకు 48,693 ఓట్లు పోలై 69.80 శాతం నమోదైంది.
దాడులు.. బెదిరింపులు
దాడులు.. బెదిరింపులు
దాడులు.. బెదిరింపులు
దాడులు.. బెదిరింపులు
దాడులు.. బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment