టీడీపీ నేతకు ఓటుపై అభ్యంతరం
సమయం దాటిందంటూ పీఓ నిరాకరణ
ఉంగుటూరు: ఉంగుటూరు హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద గురువారం సాయంత్రం స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దీంతో బ్యాలెట్ బాక్సుకు సీల్ వేసే ప్రక్రియ ఆలస్యమైంది. టీడీపీ నేత ఓటు కోసం పట్టుబట్టగా.. సమయం ముగిసిందంటూ పీఓ అభ్యంతరం చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. ఉంగుటూరు సర్పంచ్ భర్త బండారు మధు పోలింగ్ సమయం అయిపోతుందని తెలుసుకుని మధ్యాహ్నం 3.50 గంటలకు హడావుడిగా పోలింగ్ బూత్‌లోకి వచ్చారు. అయితే గుర్తింపు కార్డు లేకపోవడంతో పీఓ, డిప్యూటీ తహసీల్దార్ పోతురాజు ఓటు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పారు. దీంతో మధు సన్నిహితులకు చెప్పి గుర్తింపు కార్డును తెప్పించారు. అయితే అప్పటికే సాయంత్రం 4 గంటల సమయం దాటిపోయింది. దీంతో ఓటు ఇచ్చేందుకు పీఓ కుదరదని చెప్పగా.. ఓటు ఎందుకు ఇవ్వరని మధు వాగ్వాదానికి దిగారు. ఏ జెంట్లు చెప్పిని పీఓ అంగీకరించలేదు. దీంతో బ్యా లెట్ బాక్సుకు పీఓ సీల్ వేసినా ఏజెంట్లు వే యలేదు. విషయం తెలిసిన చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ అక్కడకు చేరుకున్నారు. ఓటు ఇవ్వకపోవడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్టు మధు తెలిపారు. కొద్దిసేపటికి విషయం సర్దుమణగగా ఏజెంట్లు సీలింగ్ ప్రక్రియ పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment