బలివేలో కల్యాణ శోభ
ముసునూరు: బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నాలుగు జంటలు పెళ్లి పీటలపై కూర్చోగా అర్చకులు అరుణ భాస్కర్, అమర్ బాబు బృందం కల్యాణ తంతు జరిపించారు. అనంతరం స్వామివారు గ్రామోత్సవంతో కిలోమీటరు దూరంలోని మృత్యు మల్లేశ్వర స్వామి (తాతగుడి) ఆలయానికి తరలివెళ్లి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించారు. ముసునూరు ఎస్సై ఎం.చిరంజీవి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉత్సవ ప్రాంగణంలో దేవదాయశాఖ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీనివాసా నాట్యమండలి (విజయవాడ) ప్రదర్శించిన మోహినీ భస్మాసుర పౌరాణిక పద్యనాటకం ఆకట్టుకున్నాయి. గురువారం ఉదయం స్వామి వారికి బిందె తీర్థం, హోమం, బలిహరణ, సాయంత్రం హోమం, బలి హరణాదులు, మహా కుంభం, నారకోలోత్సవం నిర్వహించారు.
అమావాస్య స్నానాలకు భారీగా..
గురువారం రాత్రి నుంచి అమావాస్య స్నానాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్సవాల అధికారి అనూరాధ తెలిపారు. వైద్యాధికారి షకీనా ఇవాంజిలిన్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం కొనసాగుతోంది. ఎంపీడీఓ రాణి, ఈఓపీఆర్డీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సర్పంచ్ రావు ప్రవీణ, ఈఓ పామర్తి సీతారామయ్య ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment