ఏలూరు (టూటౌన్): పెదవేగి మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలు చేశారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. పెదవేగి మండలంలోని 324, 325, 326, 327 పోలింగ్ కేంద్రాల్లో కూటమి నాయకులు దొంగ ఓట్లు భారీగా వేయించారని ఆరోపించారు. ఈ ప్రక్రియని అడ్డుకున్న పీడీఎఫ్ అభ్యర్థి ఏజెంట్లు, కార్యకర్తలపై కూటమి నాయకులు బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ వారి అనుచరులు దాడి చేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసిన గేదెల శివకుమార్, పిల్లి రామకృష్ణలపై దాడి చేశారన్నారు. పెదవేగిలో ఎస్సై, తహసీల్దార్ సమక్షంలోనే గేదెల శివకుమార్‌ని లాక్కొచ్చి కొట్టారని మండిపడ్డారు. మహిళలపై దాడిచేయడంతో పాటు వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను పగులకొట్టి, విలువైన వస్తువులను ధ్వంసం చేశా రని ఆరోపించారు. మహిళలను పరుష పదజాలంతో దూషించటం అప్రజాస్వామికమన్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment