
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో పాటు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్‌వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment