ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏలూరు విద్యుత్ సంస్థ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం నాయకులు ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరిలో విద్యుత్ సంస్థ సీఎండీతో చేసుకున్న ఒప్పందంలో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న నేపథ్యంలో రా ష్ట్రంలోని 4,500 మంది మీటర్ రీడర్లు ఉపాధి కో ల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ అర్హతను బట్టి విద్యుత్ శాఖలో ఉపాధి కల్పించాలని కో రారు. ప్రతి నెలా వేతనాలు చెల్లించడానికి ఎస్క్రో ఖాతాను తక్షణమే ప్రారంభించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వర రావు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కోశాధికారి కె.మల్లేశ్వరరావు మాట్లాడారు.