
మద్యంషాపు ఏర్పాటుపై మండిపాటు
నరసాపురం: నరసాపురంలోని 26వ వార్డు వీవర్స్ కాలనీలో మద్యం షాపు ఏర్పాటును శనివారం స్థానికులు అడ్డుకున్నారు. కల్లుగీత కార్మికుల కోటాలో షాపును వీవర్స్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసే యత్నం చేశారు. షాపును ప్రారంభానికి సిద్ధం చేస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో ఇళ్ల మధ్య బ్రాందీ షాపు పెడితే ఎలాగని ప్రశ్నంచారు. కాలనీలో రోడ్డుపై మహిళలు తిరగలేరని, చిన్న పిల్లలు ఆడుకునే గ్రౌండ్ వద్ద షాపు ఎలా పెడతారని నిలదీశారు. మహిళల ఆందోళనతో నిర్వాహకులు షాపు ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెళ్లిపోయారు.