10 వేల మందికి క్యాన్సర్‌ టీకాలు | - | Sakshi
Sakshi News home page

10 వేల మందికి క్యాన్సర్‌ టీకాలు

Published Mon, Mar 24 2025 2:24 AM | Last Updated on Mon, Mar 24 2025 2:25 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు 10 వేల మంది విద్యార్థులకు టీకాలు వేయించనున్నట్టు రోటరీ (3020) జిల్లా గవర్నర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక వైఎంహెచ్‌ఏ హాల్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోట రీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పోలియో నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. క్లబ్‌ అధ్యక్షుడు ఎన్‌జీవీ స్వామి మాట్లాడుతూ రోటరీ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. అన్నార్తులకు, దివ్యాంగులకు ఆహారం అందజేస్తామన్నారు. స్థానిక సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ సెంటర్‌లో రోటరీ పీస్‌ టవర్‌ నిర్మాణానికి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ దాకారపు కృష్ణ, జిల్లా సెక్రటరీ కల్యాణ్‌రాజు, రోటరీ పీడీజీ డాక్టర్‌ పి.దామోదర్‌ రెడ్డి, డాక్టర్‌ లలిత పాల్గొన్నారు.

26న జాబ్‌మేళా

బుట్టాయగూడెం : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. బుట్టాయగూడెం ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో మేళా జరుగుతుందని ప్రిన్సిపాల్‌ జి.కుసుమ ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. 150 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. పదో తరగతి ఆపై చదివి 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. అభ్యర్థులు బ యోడేటా, సర్టిఫికెట్ల నకళ్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌ 9492582007, 9666322032 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

పీజీఆర్‌ఎస్‌ వికేంద్రీకరణ

ఏలూరు(మెట్రో) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం మండల, డివిజనల్‌, మున్సిపల్‌, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ఈనెల 27న ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సోమవారం పోలవరంలో ఏర్పాట్ల పరిశీలనలో ఉంటారన్నారు. అయినా ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులు ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే మండల, డివిజనల్‌, మున్సిపల్‌ స్థాయిలో కూడా కార్యక్రమం నిర్వహిస్తారని డీఆర్వో పేర్కొన్నారు.

గ్రంథాలయాలకు సెస్‌ బకాయిలు చెల్లించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏలూరు నగరపాలక సంస్థ చెల్లించాల్సిన సుమారు రూ.11 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్‌టీఐ కార్యకర్త కాపల్లి విజయ మారుతి హరినాథరాజు ఆదివారం ప్రకటనలో డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలు ప్రజల నుంచి సెస్సులు వసూలు చేస్తున్నా వాటిలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వా టా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశా రు. జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల కోసం అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై తాను లోకాయుక్తను ఆశ్రయించగా నగరపాలక సంస్థ కమిషనర్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసిందన్నారు. దీనికి స్పందించిన కమిషనర్‌ తక్షణమే జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.20 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అన్ని స్థానిక సంస్థలూ జిల్లా గ్రంథాలయ సంస్థకు బకాయి ఉన్న సెస్‌ వాటాను వెంటనే చెల్లించాలని కోరారు.

ప్రశాంతంగా ఉల్లాస్‌ పరీక్షలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 27 మండలాల్లో ఆదివారం ఉల్లాస్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 7,321 మందికి 7,261 మంది పరీక్షకు హాజరయ్యారని, 99.18 శాతం హాజరు నమోదైనట్టు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జీసీహెచ్‌ ప్రభాకర్‌ రావు తెలిపారు.

పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ కోసం నిరుద్యోగులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. పది, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 550 పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement