
తీవ్ర నిరాశ కలిగించింది
తొలి రోజు రూ.290 రావడంతో రైతులు నిరాశ చెందారు. గత ఏడాది సరాసరి రూ.335 వచ్చింది. సరాసరి రూ.350 వస్తేనే పెట్టుబడులు తిరిగి వస్తాయి. 10 రోజులు చూస్తాం. ఇలాగే కొనసాగితే ప్రతిఘటిస్తాం. సరాసరి రూ.350 వచ్చేలా కంపెనీలు, బోర్డు, ప్రభుత్వం కృషిచేయాలి. జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులతో పోల్చితే మిగిలిన చోట్ల పంట తక్కువ. దీంతో ఆఖరిగా నిలిచిన జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదు బోర్డులను సమానం చేసి వేలం నిర్వహించాలి.
– వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు