
ఖాకీల పచ్చపాతం
ఈవీఎం గోడౌన్ తనిఖీ
ఏలూరు(మెట్రో): జిల్లాకు సంబంధించి ఈవీంలను భద్రపరచిన కలెక్టరేట్‌లోని గోడౌన్‌ను శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు.
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికల పోరులో పోలీసులు పచ్చ పార్టీ నేతలకు పూర్తిగా దాసోహం అనే రీతిలో వ్యవహరించారు. అత్తిలిలో రెండు రోజులపాటు వందలాది మంది టీడీపీ కేడర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాన్ని చుట్టుముట్టినా పోలీసులు స్పందించని పరిస్థితి. కై కలూరులో తీవ్ర ఘర్షణలు, ఒక రిపోర్టర్‌పై తీవ్రస్థాయిలో దాడి జరిగినా పట్టించుకోలేదు. యలమంచిలిలో మాత్రం మంత్రి మాటలకు తలొగ్గి ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని అరెస్ట్ చేయడానికి తీవ్ర అత్యుత్సాహం చూపించారు. డీజీపీ మొదలు రెండు జిల్లాల ఎస్పీల వరకూ ఎవరికి ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేసినా స్పందించని దుస్థితి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాకీలను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలు చేసిన అరాచకం.
అత్తిలిలో చేష్టలుడిగి చూస్తూ..
తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం ఎంపీపీ ఎన్నిక షెడ్యూల్ మేరకు గురువారం జరగాల్సి ఉంది. 13 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి నివాసానికి చేరుకుని ప్రభుత్వ కా ర్యాలయానికి వెళ్లడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో వందలాది మంది టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి ఇల్లు చుట్టుముట్టారు. దమ్ము ఉంటే మమ్మల్ని దాటి వెళ్లండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... వాహనాలను రోడ్లకు అడ్డంగా పెట్టి మో హరించారు. కొన్ని గంటల పాటు హైడ్రామా నడిపారు. తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, అత్తిలి ఎస్సై ప్రేమ్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ తో సహా డీజీపీ వరకూ అందరికీ మాజీ మంత్రి ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదు. వందలాది మంది చుట్టుముట్టి దాడికి సిద్ధంగా ఉండగా అత్తిలిలో ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఒక దశలో కూటమి శ్రేణులు కారు మూరి నివాసం గేట్లను నెట్టుకుని రావడానికి య త్నిస్తే కారుమూరి, వైఎస్సార్‌సీపీ కేడర్ అడ్డుకున్నారు. శుక్రవారం టీడీపీ మరో అడుగు ముందుకేసి ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే మహిళల ను వాహనాల్లో తరలించారు. ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడిన క్రమంలో ఆ రోజూ వందలాది మందిని టీడీపీ మోహరించి ఎంపీటీసీలను బయటకు రానివ్వకుండా చేసింది. అలాగే గ్రామంలోకి వచ్చే వాహనాలన్నింటినీ తనిఖీలు చేస్తూ పోలీసులు హడావుడి చేశారు. కనీసం దాడి జరిగే అవకాశం ఉన్న ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దడం, ఎంపీటీసీలకు రక్షణ కల్పించి ఎన్నికకు తీసుకువెళ్లే ప్రయత్నంగాని చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి కారుమూరి విలేకరుల సమావేశం నిర్వ హించి ఎస్పీ మొదలు డీజీపీ, డీజీపీ పీఏ వరకూ అందరికీ ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదు.
కై కలూరులో దాడులు జరిగినా..
కై కలూరులోనూ ఇదే తరహాలో పోలీసులు వ్యవహరించారు. కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతలు సుమారు 30 మంది జర్నలిస్టులపై పోలీసుల సమక్షంలో దాడి చేసినా కనీసం స్పందించలేదు. భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు సూర్యనారాయణను గురు, శుక్రవారాలు రెండు రోజులు పాటు ఇంటి వద్దనే ఎన్నికకు రానివ్వకుండా చేసిన దానిపై మాజీ ఎమ్మెలే దూలం నాగేశ్వరరావు ఎస్సై మొదలు ఎస్పీ వరకూ ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. రెండు రోజులపాటు ఇదే తరహాలో అధికార పార్టీ హడావుడి చేసి బలం లేకపోయినా దొడ్డిదారిన వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకుంది.
న్యూస్‌రీల్
యలమంచిలిలో అత్యుత్సాహం
యలమంచిలిలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ (గుంపర్రు)ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదు. దీంతో ఆమె కుమార్తె, బాలిక షర్మిలతో సత్యశ్రీ కిడ్నాప్‌నకు గురైందని ఫిర్యాదు తీసుకుని ఎన్నిక కోసం కార్యాలయానికి వచ్చిన ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి పాలకొల్లు రూరల్, టౌన్ సీఐలు గుత్తల శ్రీనివాస్, కోలా రవికుమార్, యలమంచిలి ఎస్సై బుర్రయ్యలు హడావుడి చేశారు. స్టేషన్‌కు రావాలని గట్టిగా పట్టుబడితే ఎన్నిక అయ్యాక వస్తానని ఆమె చెప్పినా సీఐ వినకుండా మహిళా కానిస్టేబుల్ సాయంతో జీపు ఎక్కించాలని ఆదేశించారు. చివరకు సత్యశ్రీ, ఎ మ్మెల్సీ కవురు శ్రీనివాస్ గట్టిగా పోలీసులతో వా దనలకు దిగడంతో వారు వెళ్లిపోయిన పరిస్థితి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగునా పోలీసులు కూటమి సేవలో తరలించారు.
కూటమి సేవలో పోలీస్
ఉమ్మడి పశ్చిమలో టీడీపీ బరితెగింపు రాజకీయాలు
అత్తిలిలో తీవ్ర ఘర్షణలు జరిగినా పట్టించుకోని పోలీసులు
కై కలూరులో దాడులు జరిగినా స్పందన నిల్
రివర్స్ కేసుల పేరుతో యలమంచిలిలో హడావుడి
స్థానిక పోరులో పోలీసుల అత్యుత్సాహం
డీజీపీ నుంచి ఎస్పీ వరకూ స్పందించని వైనం

ఖాకీల పచ్చపాతం

ఖాకీల పచ్చపాతం