ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కమి సమ్మేళనం, పంచాంగ శ్రవణం ఆకట్టుకున్నాయి.
పండితులు, రైతులు, కళాకారులకు సత్కారాలు
అర్చకులు గూడూరు శ్రీనివాసరావు (మండవల్లి), కందుకూరి రామబ్రహ్మానంద శర్మ (ఏలూరు), వేదాంతం లక్ష్మీనరసింహాచార్యులు (ముసునూరు), వెంకట నాగ శ్రీధర్‌శాస్త్రి (కై కలూరు)ను నగదు పురస్కారాలతో కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సత్కరించారు. ఆదర్శ రైతులు మలకపల్లి వీరరాఘవయ్య (ఆడమిల్లి), మద్దుకూరి కృష్ణ (కొయ్యలగూడెం), పర్వతనేని రామకృష్ణ (సీతంపేట), ఉప్పలపాటి చక్రపాణి (లక్ష్మీపురం), సింహా ద్రి గోపాలకృష్ణ (రాట్నాలకుంట)ను సత్కరించారు. కళాకారులు బొడ్డేపల్లి అప్పారావు, షేక్ మహబూబ్ సుభాని, వి.రామాంజనేయులు, పూనెం జయ సా యి శ్రీను, టి.రమ్యకృష్ణ, కల్యాణి, వి. కామరాజు, ఘంటసాల పెద్దిరాజు, ఎడవల్లి వెంకటరమణ, మండవ రాజగోపాలకృష్ణ, బీకే బిందు, కామ సో మరాజు, గండికోట రాజేష్ సత్కరించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆర్టీసీ పీఆర్వో కేఎల్‌వీ నరసింహులు సత్కారం అందుకున్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరావు, ఆర్డీఓ ఆచ్యుత అంబరీష్ పాల్గొన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి