
ఆదర్శనీయులు జగ్జీవన్ రామ్
ఏలూరు టౌన్: తొలి ఉప ప్రధాని, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ ఆదర్శనీయులని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. శనివారం ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ కేదారేశ్వరి ఆధ్వర్యంలో జగ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ అణగారిని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి జగ్జీవన్ ఎనలేని కృషి చేశారన్నారు. పేదల హక్కుల సాధనకు పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం పార్టీ సమన్వయకర్తలు మా మిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), మేక వెంకట ప్రతాప్ అప్పారావు (నూజివీడు), తెల్లం బాలరాజు (పోలవరం), పుప్పాల వాసుబాబు (ఉంగుటూరు), కంభం విజయరాజు (చింతలపూడి)తో కలిసి డీఎన్నార్ కేక్ చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, నగర మహిళాధ్యక్షురా లు జిజ్జువరపు విజయనిర్మల, నగర బీసీ సెల్ అ ధ్యక్షుడు కిలాడి దుర్గారావు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ కై సర్, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి గాజుల బాజీ, పార్టీ నాయకులు తులసీ వర్మ, తులసీ, ఫణి, బండ్లమూడి సునీల్ పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం..
ఏలూరు (టూటౌన్): అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బాబూ జగ్జీవన్‌రామ్ నేటి తరాని కి ఆదర్శనీయులని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా స్థానిక ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే చంటి తో కలిసి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
బడుగుల ఆశాజ్యోతి
ఏలూరు (టూటౌన్): బడుగు, బలహీన వర్గాల ఆ శాజ్యోతి జగ్జీవన్‌రామ్ అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమా ర్ అన్నారు. ఏలూరులోని బార్ అసోసియేషన్ హా లులో జగ్జీవన్ జయంతి వేడుకలు నిర్వహించారు. నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు ఆధ్వర్యంలో రూపొందించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ సంక్షిప్త చరిత్ర పుస్తకాన్ని జిల్లా జడ్జి సునీల్‌కుమార్ చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శనీయులు జగ్జీవన్ రామ్

ఆదర్శనీయులు జగ్జీవన్ రామ్