15 Amazing Health Benefits Of Eating Oranges In Telugu Check Full Details - Sakshi
Sakshi News home page

Benefits Of Eating Oranges: రోజుకు 2 గ్లాసుల ఆరెంజ్‌ జ్యూస్‌ తాగారంటే.. ఈ విషయాలు తెలిస్తే..

Published Sat, Nov 27 2021 9:55 AM | Last Updated on Sat, Nov 27 2021 1:45 PM

Amazing 15 Health Benefits Of Eating Oranges In Telugu Check Details - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Amazing 15 Health Benefits Of Eating Oranges In Telugu Check Details: చూడగానే తినేయాలని... జ్యూస్‌ తాగేయాలని అనిపించేది. నారింజ, కమలా పండ్లే... రెండూ సిట్రస్‌ జాతికి చెందిన ఫలాలే. నారింజ రుచికి పులుపు ఎక్కువగా ఉంటే కమలా పండు తియ్యగా ఉంటుంది. శీతాకాలంలో విరివిగా దొరికే కమలా పండ్లను వీలయినప్పుడల్లా తీసుకుంటూ ఉంటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఇంచుమించు ఒకే లక్షణాలు ఉంటాయి కాబట్టి కమలా, నారింజ.. రెంటినీ కలిపి సింపుల్‌గా ఆరంజ్‌ అందాం.  

కమలా లేదా నారింజలో విటమిన్‌ సి, ఎ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు ఉన్నాయి.
ఆరంజ్‌ కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. 
మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు ఆరంజెస్‌ తీసుకుంటే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా ఆరంజ్‌కి ఉంది. 
ఆరంజ్‌లో బెటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
ఇందులో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. 

రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. 
విటమిన్‌ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకుంటే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.
జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. 
గర్భిణులు రోజూ పరగడుపున ఒక గ్లాస్‌ కమలా లేదా నారింజ జ్యూస్‌ తాగితే, వేవిళ్ల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు, ఫోలిక్‌ యాసిడ్‌ సంప్లిమెంట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

నారింజ తొక్కను పడేయకుండా ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకోవాలి. 
ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్‌ చేస్తే చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. 
ఈ పండు రసం తరచు తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు. 

ఆరంజ్‌లో అధికంగా ఉండే పోలిక్‌ యాసిడ్‌ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది. 
టీనేజీలో అడుగు పెడుతున్న వారికి మొటిమలు ప్రధాన సమస్య. నారింజ లేదా కమలా రసం రాసుకుంటే ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
తరచూ జలుబు చేసే వారు ఆరంజెస్‌ తింటుండడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, జలుబు సమస్య దానంతట అదే తొలగుతుంది. 


 

రోజుకు రెండుగ్లాసుల కమలా రసం తీసుకుంటే గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు. 
కమలాల్లో ఉండే హెస్పెరిడిన్‌ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుంది.
కమలా రసం క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడుతుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు, ఉదయం స్నానానంతరం రెండు నారింజ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగి పోవడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement