Oranges
-
రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టివేత!
న్యూఢిల్లీ: నారింజ పండ్లను తీసుకువెళ్లే ట్రక్‌లో దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను గుర్తించారు అధికారులు. ముంబైలోని నారింజ పండ్లను దిగుమతి చేసే ట్రక్‌లో సుమారు రూ. 1476 కోట్ల విలువైన మెథాంఫేటమిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకువెళ్తున్నట్లు కనుగొన్నారు. ఆ ట్రక్కును డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఆపీ తనీఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. వాలెన్సియా ఆరెంజ్ డబ్బాల్లో 198 కిలోల హైప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కిలోల కొకైన్ ఉందని అదికారులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్న వ్యక్తులను కూడా విచారించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: శానిటరీ ప్యాడ్స్ ప్రశ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ) -
యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్ పుష్కలం.. ఒక్కసారి తాగారంటే!
Apple Carrot Orange Juice Recipe Health Benefits- యాపిల్ క్యారట్ ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి, ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్ పుష్కలంగా ఉండి ఫ్రీ రాడికల్స్‌పై పోరాడతాయి. క్యారట్, యాపిల్, ఆరెంజ్‌లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మండే ఎండల్లో ఈ జ్యూస్ తియ్యగా, పుల్లని రుచితో ఉండి దాహార్తిని తీరుస్తుంది. కావలసినవి: క్యారట్స్ – రెండు, యాపిల్స్ – రెండు, ఆరెంజెస్ – మూడు, నీళ్లు – కప్పు, అల్లం రసం – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, ఐస్ ముక్కలు – నాలుగు. తయారీ: క్యారట్స్, యాపిల్స్‌ను తొక్క, గింజలు తీసి ముక్కలుగా తరగాలి. ఆరెంజ్‌లను తొక్కతీసి జ్యూస్ తీసుకోవాలి. క్యారట్ ముక్కలను బ్లెండర్లో వేయాలి. దీనిలో ఆరెంజ్ జ్యూస్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. క్యారట్ గ్రైండ్ అయ్యాక యాపిల్ ముక్కలు, అల్లం రసం, పసుపు, మిరియాలపొడి, నీళ్లు పోసి మరోసారి చక్కగా గ్రైండ్ చేసుకుని గ్లాసులో పోసుకోవాలి. దీనిలో కొద్దిగా ఐస్ ముక్కలను వేసుకుని తాగితే జ్యూస్ చాలా బావుంటుంది. చదవండి: Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! -
క్రిస్మస్ వేళ ఇంటి కళకు సువాసనలు అద్దే అభరణాలు
చలికి మరింత ముడుచుకుపోయే కాలం ఇది. ఈ సమయంలోనే ఆశలపల్లకి నీ.. ఆనందాల సంబరాన్నీ మోసుకువస్తుంది క్రిస్మస్. చల్లగా కొంచెం డల్‌గా ఉండే ఈ కాలంలో మంచి సువాసనలతో, కాంతిమంతమైన రంగులతో అలంకరించుకోవడం ఈ శుభదినాలలో చూస్తుంటాం. దాంట్లో భాగంగానే ఎన్నో అందమైన అలంకరణలు చోటుచేసుకుంటాయి ఇళ్లల్లో.. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకునేవి ఎండు ఫలాలు. మసాలా దినుసులు, సువాసనలు వెదజల్లే ఆకులు. వీటిని కూడా కలుపుతూ హారంలా కట్టి, తోరణంలా అలంకరించి, వేలాడదీసి.. గొప్పగా అలంకరించుకుంటారు. ఎండిన నారింజ తొనలు, లవంగ మొగ్గలు, ఇలాయిచీలు, బిర్యానీ ఆకులు.. ఇలాంటివన్నీ ఈ అలంకరణలో చోటుచేసుకుంటాయి. నారింజ తొనలు ► డైనింగ్ టేబుల్ ప్రత్యేక అలంకరణ కోసం కొన్ని పచ్చని ఆకులు, వాటి మధ్యన ఒకట్రెండు ఎండిన నారింజ తొనలను ఉంచవచ్చు. ఎండిన నారింజ తొనలు పచ్చని హరితాల మధ్య మరింత అందంగా కనిపిస్తాయి. ► ఆకులు పువ్వులతో చేసిన అందమైన పుష్పగుచ్ఛంపై కొన్ని నారింజ తొనలను డెకోరేట్ చేసి గోడలను అలంకరించుకోవచ్చు. హారంలా గుచ్చి, తోరణంలా గది గోడకు లేదా ఒక కార్నర్ ప్లేస్‌లో వేళ్లాడదీయవచ్చు. దాల్చిన చెక్క.. లవంగ మొగ్గ ► ఎండిన కొమ్మను ఆకులు లేకుండా పూర్తిగా తీసేసి, ఆ కొమ్మకు నారింజ తొనలు, బిర్యానీ ఆకులు, కొన్ని దాల్చిన చెక్కలు, మరికొన్ని లవంగ మొగ్గలు.. హారంలా గుచ్చి డైనింగ్ రూమ్‌లో ఒక గోడకు వేలాడదీయవచ్చు. దీని వల్ల ఆ గదికి ప్రత్యేకమైన అందంతో పాటు మంచి సువాసన వస్తుంది. ఈ దండలను క్రిస్మస్ చెట్టుకు కూడా అలంకరిస్తుంటారు. అందమైన బహుమతి ► ఎండిన నారింజ తొనలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, చెక్కపూసలు, దారపు పోగులతో అల్లిన టాసెల్స్, రిబ్బన్లతో అందమైన అలంకరణ వస్తువును తయారుచేయవచ్చు. దీనిని ఇంట్లో అలంకరించుకోవచ్చు. ఆత్మీయులకు క్రిస్మస్ కానుకగానూ ఇవ్వచ్చు. ► అలంకరణలో వాడుకున్న ఈ దినుసులను ఆహారపదార్థాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. అంటే, వీటి వల్ల ఇంటికి పండగ కళ రావడంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుందన్నమాట. ఈ అలంకరణ తయారీలో పిల్లలను పాలుపంచుకునేలా చేస్తే వారికి ఇదో అద్భుతమైన శిక్షణ అవుతుంది. కాలానుగుణంగా తీసుకునే దినుసులు, పదార్థాల పట్ల అవగాహన పెరుగుతుంది. ఆనందమూ కలుగుతుంది. ఇంటిల్లిపాదికి ఆరోగ్యమూ చేకూరుతుంది. -
Oranges: రోజుకు 2 గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగారంటే..
Amazing 15 Health Benefits Of Eating Oranges In Telugu Check Details: చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించేది. నారింజ, కమలా పండ్లే... రెండూ సిట్రస్ జాతికి చెందిన ఫలాలే. నారింజ రుచికి పులుపు ఎక్కువగా ఉంటే కమలా పండు తియ్యగా ఉంటుంది. శీతాకాలంలో విరివిగా దొరికే కమలా పండ్లను వీలయినప్పుడల్లా తీసుకుంటూ ఉంటే ఏయే ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఇంచుమించు ఒకే లక్షణాలు ఉంటాయి కాబట్టి కమలా, నారింజ.. రెంటినీ కలిపి సింపుల్‌గా ఆరంజ్ అందాం. ►కమలా లేదా నారింజలో విటమిన్ సి, ఎ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు ఉన్నాయి. ►ఆరంజ్ కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. ►మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు ఆరంజెస్ తీసుకుంటే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా ఆరంజ్కి ఉంది. ►ఆరంజ్‌లో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ►ఇందులో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. ►రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ►విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకుంటే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ►జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. ►గర్భిణులు రోజూ పరగడుపున ఒక గ్లాస్ కమలా లేదా నారింజ జ్యూస్ తాగితే, వేవిళ్ల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు, ఫోలిక్ యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ►నారింజ తొక్కను పడేయకుండా ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకోవాలి. ►ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. ►ఈ పండు రసం తరచు తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు. ►ఆరంజ్‌లో అధికంగా ఉండే పోలిక్ యాసిడ్ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది. ►టీనేజీలో అడుగు పెడుతున్న వారికి మొటిమలు ప్రధాన సమస్య. నారింజ లేదా కమలా రసం రాసుకుంటే ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ►తరచూ జలుబు చేసే వారు ఆరంజెస్ తింటుండడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, జలుబు సమస్య దానంతట అదే తొలగుతుంది. ►రోజుకు రెండుగ్లాసుల కమలా రసం తీసుకుంటే గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు. ►కమలాల్లో ఉండే హెస్పెరిడిన్ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుంది. ►కమలా రసం క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడుతుంది. ►రోజూ రాత్రి పడుకునే ముందు, ఉదయం స్నానానంతరం రెండు నారింజ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగి పోవడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. -
వామ్మో, మరీ ఇంత కక్కుర్తా?
చైనా: చైనాకు చెందిన వాంగ్ తన ముగ్గురి స్నేహితులతో కలిసి విమానయానానికి సిద్ధమయ్యాడు. అయితే వారి దగ్గర మరీ ఎక్కువ లగేజ్ ఉంది. ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారం పరిమిత లగేజీ కంటే ఎక్కువ బరువు ఉంటే దానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అక్కడి సిబ్బంది వీరి దగ్గర ఉన్న సామాను బరువు రీత్యా 300 యుయాన్లు అంటే భారత కరెన్సీ లెక్కలో రూ.3,384 కట్టమన్నారు. అంత డబ్బు చెల్లించాలా? అని నోరెళ్లబెట్టిన ప్రయాణికులు వెంటనే ఓ ఉపాయం ఆలోచించారు. డబ్బులు కట్టడానికి బదులు బరువు తగ్గించుకుంటే సరిపోతుందని భావించారు. (చదవండి: జలపాతంలో బికినీ షూట్: ఇవే తగ్గించుకుంటే మంచిది!) వెంటనే బ్యాగులు తెరిచి అందులో ఉన్న ముప్పై కిలోల నారింజ పళ్లన్నీ నలుగురూ తినడం మొదలు పెట్టారు. కేవలం 20-30 నిమిషాల్లోనే పళ్లన్నింటినీ హాంఫట్ అనిపించారు. కానీ జేబు ఖాళీ అవలేదు అన్న సంతోషం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. ఒకేసారి ఎక్కువ మోతాదులో నారింజ ఫలాలను తినడంతో వారి నోటిలో పూత ఏర్పడి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా యున్నాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాళ్ల కక్కుర్తిని కొందరు తిట్టిపోస్తుంటే మరికొందరు మాత్రం 'అబ్బా, ఏం చేస్తిరి? ఏం చేస్తిరి?', 'ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందయ్యో!' అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: రుచి చూసే ఉద్యోగం.. గంటకు రూ.1700) -
అపుడు జాతీయ క్రీడాకారిణి..ఇపుడు
చిరాంగ్: ఒకప్పటి ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతలు తర్వాతి కాలంలో జీవనోపాధికోసం అష్టకష్టాలు పడుతున్న వైనం పై అనేక కథనాలు వెలుగు చూశాయి. తాజాగా అసోంకు చెందిన క్రీడాకారిణి దుర్బర పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం తాజా కలకలం రేపింది. ఒకపుడు జాతీయ స్థాయిలో గెల్చుకున్న పతకాలతో ఆమె ముఖంగా కళకళలాడింది. కానీ నేడు మండుటెండలో రోడ్డు పక్కన కమలాలు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమె పేరే ప్రముఖ ఆర్చర్ బులి బాసుమతారీ. ఒకపుడు ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో రెండు బంగారు, వెండి పతకాలు ఆమె సొంతం. కానీ ఇపుడు ఇద్దరు పిల్లల తల్లి అయిన బులి ఇపుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు స్ట్రీట్ వెండర్ గా మారిపోయింది. గత మూడేళ్లుగా ఈ ఆర్చర్ పేదరికంతో దీనంగా కాలం గడుపుతోంది. అస్సో చిరాంగ్ జిల్లా కు చెందిన బులి బాసుమతారీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఆర్చరీలో శిక్షణ తీసుకుంది. అనంతరం నేషనల్ సబ్ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకుంది. ఆతర్వాత నేషనల్ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ 50 మీటర్ల ఈవెంట్లో రెండు స్వర్ణం పతకాలను గెలుచుకుంది. 2010లో అనారోగ్యం పాలుకావడంతో క్రీడకు దూరమైంది. అనంతరం పేదరికంతో ఆమెను ఆర్చరీ క్రీడకు మరింత దూరం చేసింది. అయితే అక్కడితో బులి ఆగిపోలేదు. హయ్యర్ సెకెండరీ స్కూలు విద్యార్థులకు ఆర్చరీ క్రీడలో శిక్షణ ఇస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకుంటోంది. అనేక పతకాలు గెలుచుకున్న తాను గత మూడేళ్లుగా కమలాలు అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నాని బులి వాపోయింది. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతోంది. అయితే దీనిపై రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖ స్పందించింది. త్వరలోనే ఆమెను ఆర్చరీ కోచ్ నియమించనున్నట్టు మంత్రి పల్లబ్ లోచన్ దాస్ తెలిపారు. దీనికి ముందు పంజాబ్‌లో స్వల్ప కాలిక శిక్షణ ఇప్పించి అనంతరం, వచ్చే వారంలోనే ఆమెను కోచ్ గా నియమిస్తామని చెప్పారు.