షుగర్ లెస్‌గా తినడం దాదాసే అసాధ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులైన ఒక్కోసారి నోరు కట్టడి చేయడం కష్టంగా ఉంటుంది. స్వీట్ తినలేకపోతున్నామనే బాధను భర్తీ చేసేలా వాటి స్థానంలో ప్రాసెప్ చేసినవి కూడా వచ్చాయి. నిపుణులు అభిప్రాయం ప్రకారం వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏదీ బెటర్? పూర్తిగా షుగర్ వాడకాన్ని నియంత్రించొచచ్చా?
ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 176 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఈ ఏడాది కల్లా అది కాస్త ఏకంగా 180 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందనేది అంచనా. ప్రతీ వ్యక్తి రోజుకి 17 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పురుషులు తొమ్మిది టీస్పూన్లు, స్త్రీలు ఆరు టీస్పూన్ల చక్కెర వాడాలని సిపార్సు చేయగా, ప్రజలు మాత్రం దాన్ని మించే వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ప్రాసెస్ చేసిన షుగర్ వాడోచ్చా అంటే?. నిపుణులు దానికంటే సహజ చక్కెర్లు ఉన్న పండ్లు పాలు తీసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. తేనె వంటి కొన్ని రకాల సిరప్‌లు మంచివే గానీ వాటిలో అదనపు చక్కెర్లు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
వైద్యులు మాత్రం ఫ్రక్టోజ్, తేనె, బెల్లం వంటి వాటిల్లో తక్కువ గ్లైసెమిక్ ఉండి, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అయినప్పటికీ వీటిని కూడా అతిగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడమే గాక రక్తపోటు వంటి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అలాగే తేనెలో యాంటీమైక్రోబయల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వీటన్నింటికంటే ఉత్తమమైన స్వీటెనర్ కేవలం సహజసిద్ధమైన పండ్లేనని, అవి తీసుకోవడమే మేలని చెబుతున్నారు.
చక్కెరను పూర్తిగా తొలగించాలనుకోవడం కంటే ఇలా సహజసిద్ధమైన పండ్ల రూపంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా నారింజ, ఆపిల్, పైనాపిల్, కివి వంటి పండ్లు మంచివని చెబుతున్నారు. అలాగే వీటి తోపాటు తృణధాన్యాలు కూడా ఆరోగ్యానికి మంచివి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి చక్కెర్లను అందిస్తాయి.
ఎలాంటి చక్కెర్లకు దూరంగా ఉండాలి
- సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి జోలికి పోవకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది కాలేయం ప్రభావం చూపించి ఇన్సులిన్‌ని ప్రభావితం చేస్తుంది.
- తగినంతగా నిద్రపోకపోతే ఆకలి అనే హార్మోన్‌పై ఎలాంటి ప్రభావం ఏర్పడదు లేదంటే తెలియకుండానే ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో చక్కెర కలిగిన ఆ హరం తీసుకుంటారని చెబుతున్నారు నిపుణులు.
- నిద్రలేమి లెప్టిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో తినే సంతృప్తికి సంబంధించిన హార్మోన్, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్, అడిపోనెక్టిన్‌ల సాంద్రతను పెంచేస్తుంది. తత్ఫలితంగా స్వీట్ కంటెంట్‌కి సంబంధించినవి తినాలనిపిస్తుంది.
- నూనెలో డీప్ ఫ్రై చేసిన వాటికంటే కొద్ది ఆలివ్ నూనెతో ఓవెన్‌లో వేయించినవి తీసుకుంటే మేలని చెబుతన్నారు. ఇలా తీసుకుంటే సహజ చక్కెరలతో కూడిన పోషకాహారం శరీరానికి అందడమే గాక తినేందుకు కూడా రుచికరంగానూ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా? అధికంగా తీసుకుంటే డేంజరే!)
Comments
Please login to add a commentAdd a comment