ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళ(Maha Kumbh) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొని గంగా స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఎందరో ప్రముఖులు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసి సన్యాసులగా మారిన మేధావులను కళ్లకు కట్టినట్లు చూపించింది.
అంతేగాదు ఈ మహత్తర వేడుకలో పాల్గొని తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తుల లక్షలాదిమందిగా కదిలి రావడం విశేషం. తాజాగా ఈ వేడుకలో ఒక అందమైన సాధ్వి(beautiful sadhvi) తళుక్కుమంది. ఆమె అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్‌లో అందంగా ఉన్న ఆ యువతి సాధ్వీగా జీవిస్తోందా..? అని అంతా విస్తుపోయారు.
ఇది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి చర్చనీయాంశమైంది. అయితే ఆమె అంతా అనుకున్నట్లు సాధ్వి కాదని తేలింది. కేవలం అది గెటప్ అని ఆమె ఎలాంటి దీక్ష తీసుకోలేదని ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ అందమైన సాధ్వి పేరు హర్ష రిచారియా. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్టుయెన్సర్. గతంలో కూడా తాను ఇలా రీల్స్‌ద్వారా సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విశేషాలను ప్రజలకు తెలియజేశానని చెప్పుకొచ్చింది.
అలానే ఈసారి ఈ కుంభమేళలో వారిలా సాధ్విగా గెటప్ వేసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి..ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలియజే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈ గెటప్‌లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఇలా సాధ్విలా కనిపించడంపై సోషల్‌మీడియా ట్రోల్‌కి గురయ్యింది. ఆధ్మాత్మికత అంటే నవ్వులాటగా ఉందా..?. ఆ వేషధారణలోనే తెలుసుకునే యత్నం చేయాలా అంటూ నెటిజన్లు తింటిపోశారు.
(చదవండి: ఆ రెండు అస్సలు వదిలిపెట్టని రమ్యకృష్ణ.. అందుకే 50 ఏళ్లు దాటినా అంత ఫిట్‌గా..!)
Comments
Please login to add a commentAdd a comment