ఆహారపు అలవాట్లు మారడం తోపాటు జీవనశైలిలో ఒత్తిడి పెరగడం వల్ల జీర్ణకోశానికి వస్తున్న సమస్యల్లో కడుపులో అల్సర్స్ కూడా ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం కడుపులో ఆమ్లం (యాసిడ్) ఉత్పత్తి అవుతుంది. అది నిర్ణీత మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల కడుపులో అల్సర్లు వస్తాయి. ఇలా జీర్ణాశయంలో వచ్చే అల్సర్‌ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఈ అల్సర్స్‌ను అధిగమించాలంటే...
యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ఆహారంలో కారం, మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడటం
కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం
పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం
క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం.
(చదవండి: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..)
Comments
Please login to add a commentAdd a comment