క్రాంతి కూచిపూడి నాట్యాలయ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహా కవి, కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్ డాక్టర్ బోయి భీమన్న 'చండాలిక' డాన్స్ బ్యాలే సోమవారం రాత్రి రవీంద్ర భారతిలో కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కిషన్ రావు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.
'చండాలిక' పాత్రలో కూచిపూడి నృత్యకారిణి క్రాంతి నారాయణ్ నటించగా ఆనంద గా వీ.ఆర్ విక్రమ్ కుమార్ (విక్రమ్ గౌడ్), మాలీ గా కిరణ్మయి బోనాల, భటులుగా వినోద్, ప్రశాంత్, దీమాన్స్గా డింపుల్ ప్రియా, జాహ్నవి, రీతూ, తులసి నటించారు. డాక్టర్ బోయి భీమన్న రచించిన 'చండాలిక' డాన్స్ బ్యాలేకు ఫణి నారాయణ సంగీతాన్ని అందించగా క్రాంతి నారాయణ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భట్టు రమేష్, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ జి. పద్మజా రెడ్డి, డాక్టర్ వనజా రెడ్డి, భీమన్న సాహితి నిధి ట్రస్ట్ చైర్మన్ హైమవతి భీమన్న తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: 'సృష్టి' ప్రపంచ రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment