
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ప్రతి రోజు ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు చేసి సాయంత్రం పూట ఆనందోత్సాహాలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడతారు.
ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!
Comments
Please login to add a commentAdd a comment