Bathukamma Curtain Raiser
-
ఈనెల 25న ఎంగిలి పూల బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ప్రతి రోజు ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు చేసి సాయంత్రం పూట ఆనందోత్సాహాలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఆటలు ఆడతారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు! -
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో‘అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి ఉ ట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభి నందించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడ మీ చైర్పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చై ర్మన్ ముజీబ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు. -
బతుకమ్మ ఆడారా? అని అడుగుతారు కానీ.. బతుకమ్మ చేశారా అనరు! ఎందుకంటే?
పండుగలేమైనా... సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతాయి. కానీ... వాటితో పాటుగా వారసత్వాన్ని కూడా చాటే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి చిహ్నం బతుకమ్మ. ప్రజల బతుకులోంచి పుట్టిన పండుగ బతుకమ్మ. అసలు బతుకమ్మ పండుగలో పువ్వులకు, నైవేద్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో... ఆట పాటలకు అంతటి ప్రాధాన్యత ఉంది. బతుకమ్మ పండుగ సమయానికి తెలంగాణలో వ్యవసాయ పనులు చురుగ్గా ఉండవు. పల్లె జనానికి ఇది కాస్త తీరిక సమయం. మరోవైపు పంటలు, చెట్లు, పూలతో ప్రకృతి అంతా కళకళలాడుతూ ఉంటుంది. అందుకే ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలవుతుంది. బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణలోని ప్రతి ఆడపడుచు... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పండుగ బతుకమ్మ. రంగు రంగుల పూలతో ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. ఆడపిల్లలను బతుకు అమ్మ ... అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ. ఎక్కడైనా చూడండి.. బతుకమ్మ ఆడారా? అని అడుగుతారు కానీ.. బతుకమ్మ చేశారా అనరు. ఎందుకంటే ...ఇది నృత్య ప్రధానమైన పండుగ. గాన ప్రధానమైన పండుగ. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?