Fashion- Aparna Balamurali: గ్లామరస్ హీరోయిన్‌గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ‘ఆకాశం నీ హద్దు రా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్న తమిళ, మలయాళ నటి అపర్ణ బాలమురళి. సినిమాల్లో నటనకు అవకాశమున్న పాత్రలు.. స్క్రీన్ బయట స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ఇష్టపడుతుంది. అలా ఆమెకు నచ్చే.. ఆమె మెచ్చే ఆ బ్రాండ్స్‌లో ఈ రెండూ ఉన్నాయి..
రా మ్యాంగో
భారతదేశ శతాబ్దాల నాటి ఈ దేశపు పట్టు నేతకు కొత్త హంగులను అద్దుతూ సౌందర్య స్పృహకు సరికొత్త నిర్వచనంగా నిలుస్తోందీ రా మ్యాంగో బ్రాండ్. ఫ్యాషన్ ప్రపంచంలోకి 2008లో అడుగు పెట్టింది. నాజూకైన డిజైన్లు.. అలరించే రంగులతో చీరలు, గార్మెంట్స్ నేస్తూ ఈ బ్రాండ్ ఫ్యాషన్‌కే ఓ సిగ్నేచర్‌గా మారింది. డిజైన్లు ఎంత యూనిక్‌గా ఉంటాయో ధరలూ అంతే యూనిక్‌గా ఉంటాయి. ఆన్‌లైన్‌లో దొరుకుతాయి.
ప్రడే
స్వచ్ఛమైన వెండి నగలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యం గల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ సృష్టించుకున్న వాల్యూ. ఆ సృష్టికర్త పేరు దీప్తి ముత్తుసామి. జ్యూయెలరీ డిజైనింగ్ మీదున్న ఆసక్తే ఆమెను ఈ రంగంలోకి దింపింది. ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూయెలరీ బ్రాండ్‌లలో ఒకటిగా ‘ప్రడే’ను నిలిపేలా చేసింది. ఈ బ్రాండ్ జ్యూయెలరీ ఇటు సంప్రదాయ వస్త్రధారణకైనా.. అటు వెస్టర్న్ అవుట్ ఫిట్స్‌కైనా నప్పేలా ఉంటుంది. ధరలూ అంతే ఇటు సామాన్యులకూ అందుబాటులో ఉంటాయి అటు సెలెబ్రిటీల స్థాయినీ అందుకునేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
బ్రాండ్ వాల్యూ
చీర
బ్రాండ్: రా మ్యాంగో
ధర: రూ. 95,000
జ్యూయెలరీ
ఇయర్ రింగ్స్
ధర: రూ. 6, 890
గాజులు
బ్రాండ్: ప్రడే
ధర: రూ. 4,280
ఇండస్ట్రీకి వచ్చింది గ్లామరస్ హీరోయిన్‌గా మాత్రమే మిగిలిపోవడానికి కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా. కథలో ప్రాధాన్యమున్న పాత్రలు అంటే ఇష్టం.– అపర్ణ బాలమురళి
-దీపిక కొండి
చదవండి👉🏾Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!
Comments
Please login to add a commentAdd a comment