ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? దీనివల్ల అనేక లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్నట్లే. ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయద్దని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవలె ఓ వ్యక్తి ఫ్రైడ్‌రైస్ తిని మరణించాడు. దీనికి కారణం ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ (Fried Rice Syndrome) అని తేలింది. ఇంతకీ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఓసారి తెలుసుకుందాం.
ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది 2008లో తొలిసారి కనుగొన్నారు. 20 ఏళ్ల ఓ యువకుడు నూడుల్స్ ప్రిపేర్ చేసుకుని తిన్నాక మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. అలా మిగిలిపోయిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 5 రోజుల తర్వాత మళ్లీ వేడి చేసి తిన్నాడు. దీంతో పాయిజన్ అయ్యి ఆఖరికి ప్రాణాలను కోల్పోయాడు. తాజాగా మరో యువకుడు ఫ్రైడ్‌రైస్‌ను మళ్లీ వేడి చేసి తినడంతో పాయిజన్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ గురించి మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ గురించి అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి అని, ఇది బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియ ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుందని తేలింది.వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచినప్పుడు బాసిల్లస్ సెరియస్అనే బ్యాక్టీరియా చేరి ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది.
ఈ ఆహారం జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతుంది. అలా కలుషిత ఆహారాన్ని తింటే వాంతులు, డయేరియా, జీర్ణాశయ వ్యాధులు వస్తాయని గుర్తించారు. ఈ సిండ్రోమ్ అటాక్ అయినప్పుడు వికారం, కడుపు నొప్పి వంటివి కనిపిస్తాయి. అయితే ఇందులో మరణించడం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుందని వివరించారు.
బ్యాక్టీరియా ఉత్పత్తికి కారణాలివే:
సాధారణంగా అన్ని రకాల ఆహారాల్లో బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే సరైన పద్దతిలో నిల్వ చేయని కొన్ని రకాల ఆహారాల్లో ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ (Fried Rice Syndrome) అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వండిన కూరగాయలు, మాంసం వంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అందులో ట్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. ఫుడ్‌ను పదేపదే వేడి డి చేయడం వల్ల అవి విషతుల్య రసాయనాలను విడుదల చేస్తాయి. ఫలితంగా కొన్ని అరుదైన కేసుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది.
#Bacillus cereus is a Gram-positive #spore-forming #bacterium, that produces two different toxins. The commonest is the emetic or vomiting #toxin referred to as cereulide. The second type of B. cereus toxin is an #enterotoxin causing a diarrhoeal type of #food #poisoning. pic.twitter.com/ijoA0Ttfc3
— Food and Industrial Microbiology (@microbiology121) July 17, 2021
► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది.
► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
► పాస్తా, ఫ్రైడ్ రైట్ సహా వండిన వంటకాలని మళ్లీ వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందుకే అప్పటికప్పుడు వండుకొని తినడం మంచిది.
Can #Eating #Leftover #Rice #Kill You? Here’s The #Science Behind #FriedRiceSyndrome 😱😞🤣🤡 https://t.co/AWzWEREJok
— Garry Dulgar (@GarryDulgar) October 28, 2023
Comments
Please login to add a commentAdd a comment