
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఎవరైనా చెబితే, చికాగ్గా చూస్తాం. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి విన్న సామెతే కదా అని. అయితే, దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం.
ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది. అలాగే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట.
►పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. అంతే కాదు, ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ►ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ ను క్రమబద్ధీకరిస్తుంది.
►ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.
►పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు.
►రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవి కాలంలో మీకు వడదెబ్బ వచ్చే అవకాశం తక్కువ. దీనితో పాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవిలో వేడి నుండి మిమ్మల్ని రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయను ఉత్తమ సహజ రక్త శుద్ధిగా పరిగణిస్తారు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చే స్తుంది.
►జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుందని అంటారు. పచ్చి ఉల్లిపాయ రసం తాగాలి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక రకాల క్యాన్సర్ల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఇది మీకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి.
►ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లి గడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే వైద్య, ఆరోగ్య సంస్థలు ఔషధాల తయారీలో వీటిని వాడుతున్నాయి. ►ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి.
►బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి గడ్డలు కాపాడతాయి. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయను రోజూ తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ పెంచడం వల్ల జుట్టు పెరుగుతుంది.
►మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. అందుకే మన మన పెద్దలు ఉదయన్నే పెరుగు, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకొనేవారు. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఏర్పడే నొప్పిని నివారించేందుకు కాస్త ఉల్లి రసాన్ని రాయం వల్ల సత్వర ఉపశమనం ఉంటుంది. l
Comments
Please login to add a commentAdd a comment