హెల్త్ ఫ్యాక్ట్
సిగరెట్ అస్సలు ముట్టనివాళ్లతో పోలిస్తే... సగం సగం లేదా ఒకటి, రెండు ఫప్స్ తీసుకునే వారిలో 64 శాతం మందికి మామూలుగా పోగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెందిన అధ్యయనవేత్తలు.
ఆ అధ్యయనంలోని వివరాల ప్రకారం కొద్ది కొద్దిగా పఫ్ పీల్చినప్పటికీ వాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే 12 రెట్లు ఎక్కువని తేలింది.
అంతేకాకుండా కొద్దిపాటి మోతాదులోనైనా పోగ పీల్చేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు రెండున్నర రెట్లు అధికమని తేలింది. యాభై తొమ్మిది నుంచి ఎనభై రెండేళ్ల వరకు వయసున్న మొత్తం మూడు లక్షల మందిపై ఓ అధ్యయనం నిర్వహించాక వాటి ఫలితాలను బట్టి ఈ అంశాలు వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment