మన సమాజంలో తెలివితేటలు (IQ) ఉన్నవారిని మేధావులు అని తలకెత్తుకుంటాం. కానీ, విపరీతమైన కోపంతో ఎదుటివారిని తిట్టే మేధావిని, ఒత్తిడి తట్టుకోలేక కుంగిపోయే టాపర్‌ను మనం ఏమనాలి?
ఇక్కడే Emotional Intelligence (భావోద్వేగ ప్రజ్ఞ) ప్రాముఖ్యత తెలుస్తుంది. IQ అనేది మీ తల (Head) కి సంబంధించింది అయితే, EQ అనేది మీ హృదయానికి (Heart) కి సంబంధించింది.
IQ, EQ మధ్య తేడా ఏంటి?
IQ (Intelligence Quotient): ఇది మీ లాజిక్, మెమరీ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్. ఇది చాలా వరకు పుట్టుకతో వచ్చేది, పెద్దగా మార్చలేం.
EQ (Emotional Quotient): ఇది మీ ఎమోషన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎదుటివారి ఎమోషన్స్ కి ఎలా స్పందిస్తున్నారు అనే సామర్థ్యం. ఇది నేర్చుకోగలిగే స్కిల్.
చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ లైఫ్ లో మనం గమనించే అతి ముఖ్యమైన అంశం EQ. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్లందరూ జీవితంలో ఫస్ట్ రాకపోవడానికి, యావరేజ్ స్టూడెంట్స్ ప్రపంచాన్ని ఏలడానికి ప్రధాన కారణం ఈ EQ.
The 5 Pillars of EQ
డేనియల్ గోల్‌మన్ (Daniel Goleman) ఈ కాన్సెప్ట్‌ను ప్రాచుర్యంలోకి తెస్తూ ఒక మాట చెప్పారు: "IQ మిమ్మల్ని ఉద్యోగంలో చేర్పించవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఆ ఉద్యోగంలో ఎదిగేలా చేస్తుంది."
గోల్‌మన్ ప్రకారం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయి.
Self-Awareness (స్వయం స్పృహ): మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు భయం వేస్తుంది? ఆ సమయంలో మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అని గమనించడం.
Self-Regulation (స్వయం నియంత్రణ): ఎమోషన్స్ కలగడం సహజం, కానీ వాటికి బానిస అవ్వకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఒక్క క్షణం ఆగి స్పందించడం.
Motivation (ప్రేరణ): డబ్బు లేదా పొగడ్తల కోసం కాకుండా, మీలోని తృప్తి కోసం పని చేయడం. ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే మొండితనం.
Empathy (సహానుభూతి): ఎదుటివారి కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వారి కోణంలో అర్థం చేసుకోవడం.
Social Skills (సామాజిక నైపుణ్యం): గొడవలను పరిష్కరించడం, టీమ్ ని నడిపించడం, మనుషులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం.
మోటివేషనల్ స్పీకర్ల పొరపాటు
ట్రైనర్స్ మనకు "కోపాన్ని అణచుకో, ఎప్పుడూ నవ్వుతూ ఉండు" అని పైపైన చిట్కాలు ఇస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, ఎమోషన్ ని అణచివేయడం (Suppression) అంటే ప్రెషర్ కుక్కర్ విజిల్ ఆపేసినట్లే—అది ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది.
మార్కెట్ ఎమోషన్స్ ని దాచమంటుంది.
సైకాలజీ ఎమోషన్స్ ని ఛానలైజ్ (Channelize) చేయమంటుంది.
EQని ఎలా పెంచుకోవాలి?
Genius Matrix మోడల్ ఉపయోగించి ఈ ఎమోషనల్ స్ట్రెంత్ ని బిల్డ్ చేద్దాం.
Step 1: Break (రియాక్షన్ ని బ్రేక్ చేయండి)
మీరు ఒక సంఘటనకు స్పందించే లోపు ఒక 'Gap' క్రియేట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం మీ పాత ప్రోగ్రామింగ్. ఆ ఆటోమేటిక్ రియాక్షన్ ని 'Break' చేసి, "నేను ఇప్పుడు ఎలా స్పందించాలి?" అని ఆలోచించండి.
Step 2: Build (ఎమోషనల్ వొకాబులరీ)
చాలామందికి తమకు ఏం అనిపిస్తుందో చెప్పడం రాదు. "నాకు బాధగా ఉంది" అనడానికి బదులు "నాకు కోపంగా ఉంది" అంటారు. మీ ఎమోషన్ కి సరైన పేరు పెట్టడం నేర్చుకోండి. మీ లోపల ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫౌండేషన్ ని 'Build' చేయండి.
Step 3: Beyond (స్టాయిక్ మైండ్‌సెట్)
పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ప్రశాంతతను ఎవరు చెడగొట్టలేనప్పుడు మీరు 'Beyond' స్టేజ్ లో ఉన్నట్లు. ఇతరుల ప్రవర్తన మీ మూడ్ ని శాసించకూడదు. అదే నిజమైన పర్సనాలిటీ గ్రోత్.
మీ ఎమోషనల్ చెకప్
ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి.
గత వారంలో మీరు ఎవరిపైనైనా విపరీతంగా అరిచారా? ఆ తర్వాత బాధపడ్డారా? (అక్కడ మీ EQ తక్కువగా ఉందని అర్థం).
ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు అతిగా తింటారా? లేక అందరిపై విసుక్కుంటారా?
ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మీరు నిజంగా వారి బాధను ఫీలవుతున్నారా?
స్మార్ట్ అవ్వడం కంటే స్ట్రాంగ్ అవ్వడం ముఖ్యం!
బ్రో, IQ మిమ్మల్ని ఒక మంచి ఇంజనీర్ లేదా డాక్టర్ ని చేయవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఒక మంచి లీడర్ ని, మంచి భర్తని/భార్యని, ఒక గొప్ప మనిషిని చేస్తుంది. తెలివితేటలు ఉన్నవాడు గెలుస్తాడేమో కానీ, భావోద్వేగ స్థిరత్వం ఉన్నవాడు మాత్రమే ఆ గెలుపును నిలబెట్టుకోగలడు.
గుర్తుంచుకోండి, "Life is 10% what happens to you and 90% how you react to it."
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com
(చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం)


