వర్షాకాలంలో వేడివేడి బజ్జీలు తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు చాలామంది. అయితే ఈసారి క్యారెట్ కార్న్ బజ్జీ ట్రై చేసి చూడండి. మరి ఆ తయరీ విధానమేంటో చూసేయండి..
క్యారెట్ కార్న్ బజ్జీ తయారీకి కావల్సినవి:
క్యారెట్ – 3 (పెద్దవి, గుండ్రంగా లేదా పొడవుగా కట్ చేసుకోవాలి)
శనగపిండి – 1 కప్పు
ఉప్పు, కారం – సరిపడా
కార్న్ పౌడర్ – పావు కప్పు
బేకింగ్ సోడా – కొద్దిగా
నీళ్లు – తగినన్ని
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానమిలా..
ముందుగా ఒక బౌల్‌లో శనగపిండి, కార్న్ పౌడర్, ఉప్పు, కారం, గరంమసాలా, బేకింగ్ సోడా వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా, బజ్జీల పిండిలా పలుచగా కలుపుకోవాలి. అందులో క్యారెట్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ముంచి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బజ్జీలను వేడివేడిగా సాస్‌లో లేదా అల్లం చట్నీలో నంజుకుని తింటే రుచిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment