వంట గదిలో కూరగాయలు, పండ్ల తొక్కలు, వ్యర్థాల నుండి ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కంపోస్ట్ ఎరువు ఇంటిపంట మొక్కలకు సులభంగా, త్వరగా పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, ఇది అద్భుతమైన ఎరువు కూడా.
మూత ఉండే డస్ట్ బిన్‌కు చుట్టూ బెజ్జాలు పెట్టి గాలి పారాడేలా (ఎరేటెడ్ బిన్) చేస్తే చాలు. అందులో వంటగది వ్యర్థాలను ప్రతి రోజూ వేస్తూ ఉండాలి. వారానికోసారి ఆ చెత్తపైన కాస్త మట్టిని చల్లి, కదిలియ తిప్పండి. తడి వ్యర్థాలతోపాటు కొన్ని ఎండిన ఆకులు లేదా చిత్రిక పట్టిన చెక్క వ్యర్థాలు వంటివి కూడా కలపాలి. తడి, పొడి చెత్త కలిపి వేయాలి.
కొంచెం శ్రద్ధ, తగుమాత్రం తేమ ఉండేలా చూసుకుంటూ ఉంటే వాసన, పురుగులు రాకుండా చూసుకోవచ్చు. గాలి తగులుతూ ఉండే బిన్‌లో చేసిన కం΄ోస్టు కాబట్టి దీన్ని ఏరోబిక్ హోమ్ కంపోస్టు అంటున్నాం. వంటింటి వ్యర్థాలను, ఎండు ఆకులను మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా.. వాటితో ఇంటి దగ్గరే మనం తయారు చేసే కం΄ోస్టు వల్ల భూగోళాన్ని వేడెక్కించే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ప్రతి కిలో కం΄ోస్టుకు 3.8 కిలోల ఉద్గారాల విడుదలను నిరోధించిన వాళ్లం అవుతాం. ఈ పని మన భూమికి మంచిది!
ఇదీ చదవండి: హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
Comments
Please login to add a commentAdd a comment