కశ్మీరీ చట్నీ తయారీకి కావల్సినవి:
కశ్మీరీ మిరపకాయలు – ఇరవై; నూనె – ఐదు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము – ఐదు టేబుల్ స్పూన్లు;
అల్లం తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు –రెండు టేబుల్ స్పూన్లు;
టొమాటో కెచప్ – ఐదు టేబుల్ స్పూన్లు; రెడ్‌చిల్లీ సాస్ – రెండు టేబుల్ స్పూన్లు;
సోయాసాస్ – టేబుల్ స్పూను; మిరియాల పొడి – టేబుల్ స్పూను;
అరోరూట్ పొడి – టేబుల్ స్పూను, చక్కెర – టేబుల్ స్పూను;
వెనిగర్ – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానమిలా:
మిరపకాయలను నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి.మిరపకాయలు చక్కగా నానాక మిక్సీజార్‌లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి.
బాణలిలో నూనె మొత్తం వేసి వేడెక్కనివ్వాలి. బాగా కాగిన నూనెలో వెల్లుల్లి తురుము, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేసి మీడియం మంట మీద వేయించాలి తరువాత ఎండుమిర్చి పేస్టు వేసి వేయించాలి.తరువాత టొమాటో కెచప్, రెడ్‌చిల్లీసాస్, సోయాసాస్, మిరియాల పొడి, అరోరూట్ పోడి, చక్కెర వేసి ఐదు నిమిషాలు తిప్పాలి.
చివరిగా రుచికి సరిపడా ఉప్పు, వెనిగర్ వేసి రెండు నిమిషాల పాటు వెయించి దించేయాలి.
నెలరోజుల పాటు నిల్వ ఉండే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, నూడుల్స్, ఎగ్‌ఫ్రైడ్‌రైస్‌ల్లోకి మంచి కాంబినేషన్.
Comments
Please login to add a commentAdd a comment